మీ అభిమాన పంచాంగ గణిత కర్త
పండిత శ్రీ ఉంగరాల అప్పారావు నాయుడు సిధ్దాంతిపండిత శ్రీ ఉంగరాల అప్పారావు నాయుడు గారు సిద్దాంతి
ది . 28/03/2016 న గుండె పోటుతో మరణించినారు.


శ్రీరస్తు                                             శుభమస్తు                                             అవిఘ్నమస్తు


శ్లో||   శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం                 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

శ్లో||   ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ             
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః              

జ్యోతిష శాస్త్రము దాని ఆవశ్యకత:- గతజన్మలలో చేసుకొన్న కర్మ ఫలితాన్ని అనుభవించవల్సివుండగా ఏఫలితాన్ని ఏసమయంలో అనుభవించవల్సి వుంటుందో జ్యోతిష శాస్త్రము తెలుపు తుంది.

జాతకంద్వార చెడు సమయాన్ని గుర్తించి ఆసమయంలో నిర్ణయాలు తీసికొనేటప్పుడు పునరాలోచన చేసి దానాది శాంతి సత్కర్మల ద్వారా నివారణచర్యలు చేసి దోషాన్ని పరిహరించుకొని సుఖ జీవనము ఏర్పాటుచేయబడినదే జ్యోతిషం. జాతకములో వున్నదితప్పక అనుభవించి తీరాలనే అభిప్రాయము కాదు. అనుభవించడమే తప్పనిసరి యైతే దానిని తెలిసుకొని ప్రయోజనములేదు. మంచి ఫలితాన్ని ముందుగా తెలిసికొనడంవల్ల క్రియాశీలత లోపించడం, చెడుఫలితాలను ముందుగా తెల్సికొనడంవల్ల యిప్పటనుండి విచారించడం శాస్త్ర ప్రయోజనంకాదు. రాబోయే మంచి ఫలితాన్ని జాతకం ద్వారా తెలిసుకొని దానికి అనుగుణముగా కృషి చేసి పూర్తి ఫలితాన్ని పొందడం. దుష్పలితాలను తెలిసికోవడంవల్ల దానికి వ్యతిరేకదిశలో కృషి చేసి శాంతిక్రియలు ద్వారా తొలగించడం కాని లేదా తగ్గించు కోవడానికి ప్రయత్నించి సుఖజీవనమును అనుభవించవలెను.

స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మేణేభ్యః శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా సుఖినోభవంతు||

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

X
సందేశం
మన ప్రియతమ పండిత గణిత కర్త శ్రీ ఉంగరాల అప్పారావు నాయుడు సిద్దాంతి గారు హటాతుగా గుండె పోటుతొ మనలను విడిచి శ్వర్గస్తులైనారు. దీనికి మేము, ఆయనను అభిమానించే ప్రజలు మరియూ స్నేహితులు యంతో చింతిస్తున్నాము.

వారు యెన్నో తనచుట్టూ ఉండే ప్రజలకు, తనదైన ఊరికి, వెబ్ సైట్ ద్వారా ప్రపంచానికి యెన్నో ఉచిత సేవాకార్యక్రమాలను అందించినారు. ఆయన జీవించి ఉన్నంత కాలం యెన్నో ఇంకా సేవలను ప్రజలకు అందజేయాలనే కోరికతో ఉండేవారు.

వారి కుమారులుగా వారికి పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. కొడుకులుగా మేము వారి పేరున వారి కోరికలు తీర్చే దిసగా మేము ప్రయత్నిస్తునాము.

మాతో పాటుగా మీ వంతు చేతులను జోడిస్తే మేము యెంతో ఆనందించి మా సొంత ఊరు అయిన బాలాంత్రం గ్రామానికి మా నాన్నగారి పేరున ఆయన కోరికల ప్రకారం సేవలను ప్రజలకు అందజేస్తాము. మీరు మీ వంతు సాహాయం చేయు ఉద్దేసం కలిగి ఉంటే మా మొబైల్ నంబర్ ద్వారా సంప్రదించవలసినదిగా కోరుతున్నాము. మా మొబైల్ నంబర్: +91 9705338953, +91 9010042299

         ఇట్లు వారి కుమారులు ఉంగరాల భీమ శంకర్ నాయుడు మరియూ ఉంగరాల రామచంద్రరావు నాయుడు.