శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
 
శ్లో|| ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః



జన్మించిన సమయములో గ్రహాల స్థితిగతులను తెలిపేది జాతకము. అట్టి జాతకము ద్వారా గతజన్మలలో చేసుకొన్న కర్మ ఫలితాన్ని ఏసమయంలో అనుభవించవల్సి ఉంటుందో తెలిపేది జ్యోతిష శాస్త్రము. పాపకర్మ ఫల సమయములను గుర్తించి వాటికి నిర్మోలన కొరకు ఉపకర్మలు ఆచరింప చేయడము కొరకు పుట్టబడినది జ్యోతిష శాస్త్రము.
చెడుసమయంలో నిర్ణయాలు తీసికొనేటప్పుడు పునరాలోచన చేసి అవసరమైతే దానాది శాంతి సత్కర్మలు చేసి దోషాన్ని పరిహరించుకొని సుఖ జీవనము ఏర్పాటు చేసుకొనవచ్చునని వేదములు చెప్పుచున్నవి. జాతకములో ఉన్నది తప్పక అనుభవించి తీరాలనే అభిప్రాయముండదు. అనుభవించడమే తప్పనిసరి అయితే దానిని తెలిసుకొని ప్రయోజనములేదు. మంచి ఫలితాన్ని ముందుగా తెలిసికొనడమువలన క్రియాశీలత లోపించడం, చెడుఫలితాలను ముందుగా తెల్సికొనడమువలన యిప్పటనుండి విచారించడం జరుగుతుంది. అది శాస్త్ర ప్రయోజనంకాదు. రాబోయే మంచి ఫలితాన్ని జాతకం ద్వారా తెలిసుకొని దానికి అనుగుణముగా కృషి చేసి పూర్తి ఫలితాన్ని పొందడం. దుష్పలితాలను తెలిసికోవడంవల్ల దానికి వ్యతిరేకదిశలలో శాంతిక్రియలు చేసి దుష్పలితాలను తొలగించుకొని సుఖజీవనమును అనుభవించవలెననేది శాస్త్ర ఉద్దేశము.
గతజన్మల కర్మఫలమును తెలిపేవి నవగ్రహాలు అయితే అట్టి కర్మవిపాకమునకు సహకరించేవి పంచాంగములు. పంచాంగములు అనునవి తిదులు, వారములు, నక్షత్రములు, యోగములు, కరణములు.



స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మేణేభ్యః శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా సుఖినోభవంతు||