కలియుగాదిగా పంచాంగములను మరియు గ్రహస్థితులను గణించడము


కాలము కొలతలు :
60 తత్పరలు = 1 పర
60 పరలు = 1 విలిప్త
60 విలిప్తలు = 1 లిప్త
60 లిప్తలు = 1 విఘడియ = 24 సెకనులు
60 విఘడియలు = 1 ఘడియ = 24 నిముషములు
60 ఘడియలు = 1 రోజు = 24 గంటలు
30 రోజులు = 1 సావన మాసము
12 సావన మాసములు = 1 సావన సంవత్సరము = 360 రోజులు
12 సౌర మాసములు = 1 సౌర సంవత్సరము = 365.258756481 పూర్ణగత రోజులు

ఒక చంద్ర దినము (తిది) = 0.98435293153572 రోజు
30 (తిది) చంద్ర దినములు = ఒక చంద్ర మాసము = 29.5305879460716 పూర్ణగత రోజులు
12.36882777761 పూర్ణగత చంద్ర మాసములు = 1 చంద్ర సంవత్సరము

ఒక సౌర సంవత్సరము = 1 దివ్య దినము
30 దివ్య దినములు = 1 దివ్య మాసము = 30 సౌర సంవత్సరములు
12 దివ్య మాసములు = దివ్య సంవత్సరము = 360 సౌర సంవత్సరములు

12000 దివ్య సంవత్సరములు = 1 మహా యుగము = 4320000 సౌర సంవత్సరములు
4800 దివ్య సంవత్సరములు = 1 కృత యుగము = 1728000 సౌర సంవత్సరములు
3600 దివ్య సంవత్సరములు = 1 త్రేతా యుగము = 1296000 సౌర సంవత్సరములు
2400 దివ్య సంవత్సరములు = 1 ద్వాపర యుగము= 864000 సౌర సంవత్సరములు
1200 దివ్య సంవత్సరములు = 1 కలి యుగము = 432000 సౌర సంవత్సరములు
ఒక మహా యుగము = కృత యుగము + త్రేతా యుగము + ద్వాపర యుగము + కలి యుగము
71 మహా యుగాలు = 1 మనువు = 306720000 సౌర సంవత్సరములు
1 కల్పారంభ సంది + 14 మనువులు + 14 మనువుల మద్య సందులు = 1 కల్పము
(సందికాలము 1/4 మహాయుగకాలము), (15 సందికాలముల మొత్తము = 4800 దివ్య సంవత్సరములు)
1000 మహా యుగాలు = 4320000000 సౌర సంవత్సరములు
ఒక కల్పము = ఒక బ్రహ్మ పూట. 2 బ్రహ్మ పూటలు = ఒక బ్రహ్మ రోజు

మనువుల పేర్లు :
1. స్వాయంభువ , 2. స్వారోచిష , 3. ఉత్తమ , 4. తామస , 5. రైవత , 6. చాక్షుష , 7. వైవస్వత (ప్రస్తుత) , 8. సౌర సావర్ణి , 9.దక్షసావర్ణి , 10. బ్రహ్మసావర్ణి , 11. ధర్మసావర్ణి , 12. భద్రసావర్ణి , 13. దివ్య సావర్ణి ,14. ఇంద్రసావర్ణి .

30 బ్రహ్మ అహో రాత్రులు = ఒక పగటి కల్పము + ఒక రాత్రి కల్పము = ఒక బ్రహ్మ రోజు

కల్పముల పేర్లు :
1.శ్వేత, 2. నీలలోహిత , 3. వామదివ్య , 4. రత్నాంతర , 5. రౌరవ , 6. దివ్య ,7. బృహత్ , 8. కందర్ప , 9. సద్య , 10. ఈశాన , 11.తమో , 12. సారస్వత , 13. ఉదాన , 14. గరుడ , 15. కౌర , 16. నారసింహ ,17. సమాన , 18. ఆగ్నేయ , 19. సోమ , 20.మానవ , 21. తత్పుమాన , 22. వైకుంఠ , 23. లక్ష్మీ , 24. సావిత్రీ , 25. అఘోర , 26.వరాహ , 27. వైరాజ , 28. గౌరీ ,
29. మహేశ్వర , 30. పితృ ,

30 దివ్య దినములు = 1 దివ్య మాసము. 12 దివ్య మాసములు = 1 దివ్య సంవత్సరము. 1 దివ్య సంవత్సరము = 1 బ్రహ్మ దినము
30 బ్రహ్మ దినములు = 1 బ్రహ్మ మాసము. 12 బ్రహ్మ మాసములు = 1 బ్రహ్మ సంవత్సరము. 50 బ్రహ్మ సంవత్సరములు = 1 పర అర్ధము
2 పర అర్ధములు = 1 పరము = బ్రహ్మ ఆయువు